Tuesday, February 25, 2025

కుంభమేళాకు రాలేకపోయిన భర్త.. భార్య ఏం చేసిందంటే..

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ బుధవారంతో ముగియనుంది. దీంతో ఈ వేడుకలో పాల్గొనేందుకు అంతా పోటీ పడుతున్నారు. అయితే కొందరు ఈ ఆద్యాత్మిక వేడుకలో పాల్గొనలేకపోతున్నారు. అయితే అలా కుంభమేళలో పాల్గొనలేకపోయిన తన భర్త కోసం ఓ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.

కొన్ని అనుకోని కారణాల వల్ల ఓ మహిళ భర్త కుంభమేళకు వెళ్లలేకపోయాడు. దీంతో త్రివేణి సంగమంలో దిగిన భార్య అతనికి వీడియో కాల్ చేసింది. అతను మంచం మీద పడుకొని ఉండగానే ఫోన్‌ని పలుమార్లు నీటిలో ముంచింది. దీంతో అతను కూడా పవిత్ర స్నానం చేసినట్లే అని భావించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఈ ఐడియా బాగుంది అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ‘కుంభమేళకు వెళ్లిన మేమంతా పిచ్చోళ్లమా’ అని వెక్కిరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News