Monday, January 20, 2025

దొంగ పెళ్లాం: నగదు, నగలతో పరారీ

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: పెళ్లి చేసుకున్న వారం రోజులకే భర్తను వీడి నగదు, నగలతో పరారైంది ఒక నవ వధువు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిందన్న మురిపెం తీరకముందే తనకు జెళ్ల కొట్టి వెళ్లిపోయిన పెళ్లాం పైన రసూలాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు ఆ బాధిత భర్త. నిరాలా నగర్‌కు చెందిన బాధితుడు రాంకరణ్ కథనం ప్రకారం రూ. 70,000 కమిషన్ పుచ్చుకుని స్థానిక బ్రోకర్ ఒకడు తనకు పెళ్లి సంబంధం కుదిర్చాడు. బీహార్‌కు చెందిన వధువుతో మే 15న ధరమ్‌గఢ్ బాబా ఆలయంలో రాంకరణ్‌కు పెళ్లయ్యింది. మే 23న నవ వధువుతో తన స్వగ్రామానికి చేరుకున్నాడు అతను.

వారం రోజుల తర్వాత ఒక రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య కనపడలేదు. ఇంట్లో దాచి ఉంచిన రూ. 50,000 నగదుతోపాటు పెళ్లికి తన బంధువులు ఇచ్చిన బంగారు నగలు కూడా కనపడలేదు. నగదు, నగలతో తన భార్య పారిపోయిందని అతను పోలీసులకు పిర్యాదు చేశాడు. రాం కరణ్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, పారిపోయిన అతని భార్య ఆచూకీ కోసం గాలిస్తున్నామని స్టేషన్ హౌస్ అధికారి రాం గోవింద్ మిశ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News