Thursday, January 23, 2025

భర్తను వదిలేసి ప్రేయసితో పారిపోయిన భార్య

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఓ అమ్మాయి భర్తను వదిలేసి తన ప్రేయసి దగ్గరికి పారిపోయిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఫలకాటా ప్రాంతానికి చెందిన అమ్మాయి, తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో అమ్మాయి ఒకే కాలేజీలో చదివారు. రెండు సంవత్సరాల క్రితం ఫుట్‌బాల్ ఆడుతుండగా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి ఉంటున్నారు.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తుఫాన్‌గంజ్‌కు చెందిన అమ్మాయికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. పెళ్లి చేశారు కానీ ఆమె మనసులో ఉన్న ప్రియురాలి జ్ఞాపకాలు మాత్రం అలానే ఉన్నాయి. దీంతో భర్తను వదిలి తన ప్రేయసి దగ్గరికి అమ్మాయి వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి హోటల్‌లో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News