Monday, December 23, 2024

విషాద ఘటన.. భర్త మృతిని తట్టుకోలేక ఉరి వేసుకుని భార్య మృతి..

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి: భర్త మృతిని తట్టుకోలేక చెట్టుకు ఉరి వేసుకుని భార్య మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సాయినిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయినిపల్లి గ్రామానికి చెందిన బూసి రాములు గత వారం అనారోగ్యంతో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేక భార్య మణెమ్మ(55) ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News