Thursday, December 26, 2024

భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తను చంపేశారు….

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: తన భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తపై నిందితుడు తన స్నేహితులు, బంధువులతో కలిసి దాడి చేయడంతో అతడు చనిపోయిన సంఘటన న్యూఢిల్లీలోని సమయ్‌పూర్ బడ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బబ్లూ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవన్ పార్క్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. రాజు అనే వ్యక్తి బబ్లూ భార్యను పలుమార్లు లైంగికంగా వేధించాడు. బబ్లూ భార్యతో రాజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు చూశాడు. తనని రాజు వేధిస్తున్నాడని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే రాజు, తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు గొడవ గురించి సమాచారం ఇవ్వడంతో వాళ్లందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అందరూ కలిసి బబ్లూ దాడి చేశారు. రాజు కత్తితో మూడు సార్లు బబ్లూ కడుపులో పొడవడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీస్ అధికారి రవి కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లూ పెయింటర్ పనులు చేసి ఢిల్లీలో జీవనం సాగిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News