Friday, December 20, 2024

భర్త మృతదేహంతోనే భార్య నాలుగు రోజులు జీవనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వైరా: భర్త మృతదేహం వద్దనే భార్య నాలుగు రోజులుగా జీవనం సాగించిన సంఘటన వైరాలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 20వ వార్డులోని మిట్టపల్లి రమణ రైస్ మిల్ సమీపంలో నివాసం ఉంటున్న భోగి వీరభద్రం(65)రైల్యేలో గ్యాంగ్ మెన్ గా పని చేసి పదవి విరమణ చేశాడు. నాలుగు రోజుల క్రితం వీరభద్రం అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. వీరభద్రం భార్య మంగమ్మ మతిస్థిమితం లేక పొవటంతో తన భర్త చనిపోయిన విషయం కూడా గమనించలేక పోయింది. దీంతో నాలుగు రోజుల నుండి మంచంపైనే మృతదేహం ఉండటంతో పురుగులు పట్టి దుర్వాసన వెలువడింది.

చుట్టుప్రక్కలంతా కూడా దుర్వాసన వస్తున్న వీరభద్రం భార్య మాత్రం ఆ మృత దేహం ప్రక్కనే ఉంటూ నాలుగు రోజులు జీవనం సాగించింది. అయితే వీరభద్రం కుమారుడు వెంకటకృష్ణ ఖమ్మంలో బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ తన తండ్రీతో తరుచూ మాట్లాడుతూ ఉండేవాడు. గత నాలుగు రోజుల క్రితం కూడా తన తల్లిదండ్రులతో మాట్లాడిన వెంకటకృష్ణ ఆదివారం కూడా పోన్ చేయగా తన తల్లి పోన్ లిప్ట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చిన వెంకటకృష్ణ వైరాకు వచ్చి ఇంట్లో వెళ్లి చూడగా మంచంపైన తన తండ్రీ మరణించటం చూసి షాక్ కు గురయ్యాడు. ఇదిలా ఉంటే వీరభద్రం తలకు గాయాలు ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు ఖమ్మం తరలించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News