Monday, December 23, 2024

భార్య ఇంటికి ఆభరణం: ఎంపిపి

- Advertisement -
- Advertisement -

భార్య ఇంటికి ఆభరణం: ఎంపిపి మాలోత్ శకుంతలా కిషోర్
మన తెలంగాణ/కారేపల్లి : భార్య ఇంటికి ఆభరణం అని ఎంపిపి మాలోత్ శకుంతలా కిషోర్ తెలిపారు. ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని చీమలపాడు లో ఆమె మాట్లాడారు. భరించేది భార్య, బ్రతుకు నిచ్చేది భార్య, చెలిమి నిచ్చేది భార్య, చేరదీసేది భార్య అని పేర్కొన్నారు. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు ప్రశంసించారు. భర్త వంశానికి సౄష్టికర్త, మొగుడి వంశానికి మూలకర్త అని, కొంగు తీసి ముందుకేగినా, చెంగు తీసి మూతి తుడిచినా, ముడిచినా, తనకు లేరు ఎవరు సాటి కొనియాడారు.

ఇలలో తను లేని ఇల్లు , కలలో ఊహకందని భావన అని బిడ్డల నాదరించి, పెద్దల సేవలో తరించి, భర్తని మురిపించి, మైమరపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి, చెడు ఆలోచనలు త్రుంచి, భ్రమరం లా ఎగురుతూ, భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ, కళ్ళు కాయలు కాచేలా, భర్త కోసం ఎదురుచూసేది, భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి అని కొనియాడారు. జీవితాన్ని అందించే మన మనిషి అని, ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం? ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప, అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News