Monday, December 23, 2024

ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. వేముల కుంట గ్రామంలో దళిత యువకుడు జన్మల విజయ్ భాస్కర్ అగ్ర కులానికి చెందిన యువతిని ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తరువాత దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయడానికి సదరు యువతి మార్కపురం వచ్చింది. సాధన కళాశాలలో పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా యువతి బంధువులే కిడ్నాప్ చేశారని పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే యువతి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి విచారించారు. తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులకు యువతి తెలిపింది. భర్త తరుచూ వేధిస్తుండడతో తానే తల్లిదండ్రులకు ఫోన్ చేశానని తెలిపింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి భర్త తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పింది. పోలీసులు యువతిని స్థానిక ఎంఆర్‌ఒ వద్దకు తీసుకెళ్లారు. ఎంఆర్‌ఒ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తరువాత ఆమెను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News