Tuesday, January 21, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

వాంకిడిః భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన వాంకిడి మండలంలోని దాభా గ్రామంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. బాధితురాలి కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం దాబా గ్రామానికి చెందిన వడై అమృత (25) మారుతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వడై మారుతి కొన్నాళ్లుగా మద్యానికి బానిసై భార్యను అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి మారుతి మద్యం తాగివచ్చి భార్య అమృతతో గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్త పెరగడంతో కొప తో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య అమృత మేడ, తల, చేతులపై దాడి చేశాడు.

ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డు వచ్చిన అదే గ్రామానికి చెందిన మోహర్లే పోచ్చు తలపై గొడ్డలితో దాడి చేయగా పొచ్చుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News