Monday, January 20, 2025

భార్యను చంపిన భర్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : మద్యానికి బానిసైన భర్తకు తాగడానికి డబ్బులు ఇవ్వనందుకు భార్యను హతమార్చిన సంఘటనలో భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కడ్తాల ఎసై హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గోండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తికి చెందిన వల్లభుదాసు శ్రీనివాస్, స్వరూప దంపతులు వీరి ఇద్దరు కుమారులతో కలిసి కడ్తాల మండల పరిధిలోని కర్కల్ పహాడ్ శివారులోని ఎస్‌ఎస్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11 వ తేదిన భార్యను మద్యానికి డబ్బులు శ్రీనివాస్ అడగగా ఇవ్వకుండా భర్తతో గొడవ పడింది.

ప్రతిసారి మద్యం తాగడానికి భార్య అడ్డుపడుతుందని ఎలాగైన చంపెయాలని, అదే రోజు 12 గంటలకు ఫామ్‌హౌజ్‌లో గోంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. భర్తను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ జాల ఉపేందర్, ఎసై హరీష్‌శంకర్‌గౌడ్‌లను, కానిస్టేబుల్ రామకోఠిలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News