Wednesday, January 22, 2025

హత్య చేసి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక పెట్టిన కసాయి భర్త

- Advertisement -
- Advertisement -

భార్య పై అనుమానం తో  భార్యను భర్త హత్య చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి రీటైర్డ్- ఆర్మీ.వృత్తి రీత్యా డి ఆర్ డి ఓ(డిఆర్ డిఒ)లో
ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి నిర్వహిస్తూ జిల్లెల్లగూడ లోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35) తో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

ఈనెల 13న భార్య పై అనుమానంతో ముక్కలు,ముక్కలుగా నరికి  డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక పెట్టాడు. అనంతరం శరీర భాగాలను చందన చెరువులో పడేసాడు. ఆ తరువాత  అత్తమామలతో కలిసి మీర్ పేట పోలీసు స్టేషన్ కు వచ్చి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా గురుమూర్తి ని విచారించగా అతనే హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News