- Advertisement -
ఇంటి అద్దె భార్య ప్రాణాలు తీసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం జమీల, ఇమ్రాన్ దంపతులు బెల్లంమండి వీధిలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజులగా ఇంటి అద్దె విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్య తలపై బలంగాచ సుత్తితో కొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -