భార్యాభర్తల మధ్య నెలకొన్న స్వల్ప వివాదంలో ఆగ్రహానికి గురైన భర్త క్షణాకావేశంలో భార్యను పొత్తికడుపున బలంగా మోదగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రం తండా గ్రామం శివారులో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు జైత్రం తండా శివారులోని మిర్చి వేరడానికి కొద్ది రోజుల క్రితం వచ్చారు.
భార్యభర్తల మధ్య జరిగిన ఘర్షణతో పింక్ మరావి (38) అక్కడికక్కడే మృతి చెంది చెందింది. అయితే వలస కూలీలైన భార్యాభర్తలు కమలేష్ మ రావి, పింకీ మరావిలు ఉదయం వంట చేస్తున్న క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. ఈ ఘటనలో భార్యను పొత్తికడుపుపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయం కావడంతో అ క్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న కారేపల్లి ఎస్‌ఐ ఎన్ రాజారామ్ సంఘటన స్ధలానికి వెళ్లి, కేసు నమోదు చేసి నిందితుడు కమలేష్‌ను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.