Monday, January 27, 2025

భర్త చేతిలో భార్య హతం..

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ భర్త… భార్య గొంతు నులిమి హత్య చేసినట్లు కేటిదొడ్డి ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఇర్కిచేడు గ్రామానికి చెందిన నగేష్ కు ధరూర్ మండలం మన్నాపురం గ్రామానికి చెందిన పవిత్ర(23)తో వివాహం జరిగింది. గత కొంత కాలంగా నగేష్ భార్యను వివిధ కారణాలను సాకుగా చూపి తరుచూ వేధించేవాడని, ఈ క్రమంలో గురువారం భార్య గొంతు నులిమి, గ్రామ శివారులో గల వ్యవసాయపొలం సమీపంలో వాగు వద్ద ఉన్న ఓ గుంతలో మృతదేహాని వేసి, మృతదేహాం పైన ఆకులతో కప్పి ఉంచాడు.

పవిత్ర కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కన ప్రాంతంలో వెతకసాగారు. ఈక్రమంలో శుక్రవారం వాగు వద్ద ఉన్న గుంతలో మృతదేహన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కేటిదొడ్డి పోలీసులకు సమాచారం అందజేశారు. మృతురాలికి ఒక బాబు, ఒక పాప. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News