Friday, December 27, 2024

భార్య, అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : పెళ్లై రెండు వారాలైంది. ఇరుకుటుంబాల్లోనే కాదు ఇరు గ్రామాల్లో ఇంకా ఆ పెళ్లి విషయాన్ని మరిచిపోలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు అల్లుడు. మామపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డకోవడంతో మామ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లాలో కల్లూరు ఎస్టేట్‌లో జరిగింది. కర్నూల్ లోని చింత మునినగర్‌కు చెందిన శ్రావణ్ హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఇతడికి వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు (50) రమాదేవి (45) దంపతుల కుమార్తె రుక్మిణి (21) తో ఇటీవలే వివా హమైంది.

రుక్మిణి కుటుంబ సభ్యులు కూడా కర్నూల్ నగరంలోని కల్లూరు సుబ్బలక్ష్మి నగర్లో నివాసం ఉంటున్నారు. కాగా పెళ్లైన రెండు రోజులకే శ్రావణ్ కుమార్‌కు ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆపరేసన్ చేయించాలని తండ్రి ప్రసాద్ హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అనంతరం మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి శ్రావణ్ కుమార్‌ను తండ్రి ప్రసాద్ ఇతర కుటుంబ సభ్యులు సుబ్బలక్ష్మి నగర్‌లోని అత్తింటికి తీసుకువచ్చారు. శ్రావణ్ ఇంటికొచ్చిన 20 నిమిషాల వ్యవధి లోనే కుటుంబంలో గొడవ చెలరేగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రావణ్, తండ్రి ప్రసాద్ సహకారంతో రుక్మిణి, అత్త రమాదేవిలపై కూరగాయలు కోసే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రుక్మిణి, రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన మామ వెంకటేశ్వర్లు పైనా శ్రావణ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News