Monday, January 20, 2025

భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విడిగా ఉంటుందని కోపంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….విజయపురి కాలనీకి చెందిన షాలిని(32), బాలకోటయ్యకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బాలకోటయ్య కూలీపనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి మునగనూర్‌లో ఇద్దరు కాపురం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగు నెలల నుంచి విడివిడగా ఉంటున్నారు. బాలకోటయ్య తన తల్లి వద్ద మునగనూర్‌లో ఉంటుండగా, షాలిని ఉంటున్న బొమ్మలగుడి వద్ద ఉంటోంది.

ఈ క్రమంలోనే బాధితులరాలు విజయపురి కాలనీ వద్ద నుంచి బైక్‌పై వెళ్తుండగా బాలకోటయ్య బండరాయితో షాలిని తలపై కొట్టగా అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News