Monday, January 20, 2025

భార్యను వెంటాడి గొంతు కోసి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నడి రోడ్డుపై వెంటపడి భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అంబిక(26), నరేందర్ దంపతులు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే ఏడాది నుంచి భార్యభర్త మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అంబిక నల్లగండ్లలోని శ్వాస బొటిక్ షాపులో పని చేస్తూ తన కూతురితో పాటు నల్లగండ్లలో ఉంటుంది. నరేందర్ తాండూరులో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అంబిక పని చేస్తున్న బొటిక్‌కు నరేందర్ వచ్చాడు.

ఇద్దరు మాట్లాడుతుండగానే వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేందర్ అక్కడే ఉన్న బండరాయితో అంబిక తలపై కొట్టాడు. గాయం కావడంతో అంబిక అక్కడి నుంచి పరుగెత్తగా వెంబడించిన నరేందర్ తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అంబిక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు, ఆ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News