మాదన్నపేట్ : పెళ్లైన నెల రోజులకే భార్య గొంతును అతి కిరాతకంగా కోసి చంపేశాడు ఓ భర్త. ఆపై భర్త కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటి మెట్ల నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోవడం ఇంటి యాజమాని గమనించాడు. దీంతో భర్తనే భార్యను చంపి ఆత్మహత్యకు య త్నించాడా లేక వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన శనివారం ఐఎస్‌సదన్ పోలీసు స్టేషన్ పరిధిలో చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిది నెలల క్రితం ఐఎస్‌సదన్ రాజిరెడ్డినగర్‌లోని ఓ ఇంట్లోకి హనుమంత్, స్వప్న(22)లు అ న్నాచెల్లెల్లమని చెప్పి అద్దెకు తీసుకున్నారు. గత మూడు నెలల నుంచి హనుమంత్ ఇంటికి రావడం లేదు.
అనుమానం వచ్చిన ఇంటి యాజమాని స్వ ప్నను అడగగా వర్క్‌ఫ్రామ్ హోం చేస్తున్నాను నాకు నెల క్రితం వివాహం జరిగిందని చెప్పింది. కానీ శనివారం ఉదయం 11.30గంటలకు ఒకసారిగా శ బ్దం రావడంతో ఇంటి యాజమాని బయటికి వచ్చాడు. ప్రేమ్(24) అనే యు వకుడు రక్తపుమడుగుల్లో పడి ఉన్నాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంటిపై నుంచి వచ్చి వేగంగా బైక్‌పై పారిపోవడం ఇంటి యాజమాని గమనించాడు. వెంటనే పైకి వెళ్లి చూసే సరికి స్వప్న చనిపోయి ఉంది. దీంతో ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వప్న మృతదేహాన్ని ఉస్మానియా హాస్పటల్ తరలించారు. ప్రేమ్‌ను కూడా వైద్య నిమిత్తం హాస్పటల్‌లో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వై ద్యులు తెలిపిన్నట్లు పోలీసులు వెల్లడించారు. సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి రోహిత్‌రాజ్ , ఎసిపి మహ్మద్ గౌస్‌లు ఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. త్వరలో కేసును చేధిస్తామని తెలిపారు.
కేసును త్వరగా చేదిస్తాం : మల్లేష్ ఐఎస్‌సదన్ ఇన్‌స్పెక్టర్
బాధితురాలి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నెల క్రితమే పవన్, స్వప్నలకు వివాహం జరిగిన్నట్లు తెలిసింది. హనుమంత్, స్వ ప్నలకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తండ్రి తెలిపారు. భర్తే భార్య ను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఇంటి యాజమాని చెప్పిన్నట్లు అదే సమయంలో పారిపోయిన వ్యక్తుల ప్రమేయం ఏమైన ఉన్నదా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో కేసును చేధించి నిందితులను పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.