Wednesday, January 22, 2025

భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

నగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలోని రాజాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… తుర్కదిన్నె గ్రామానికి చెందిన శివశంకర్ (34) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనికి గతంలో నార్నపల్లెకు చెందిన నర్మద అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడి భార్య నుండి దూరంగా ఉంటున్నాడు. అనంతరం రాజాపూర్ గ్రామానికి చెందిన మంగ దొడ్డి భారతిని (28) ని రెండో పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లుగా బంగారు తేవాలంటూ భార్యతో గొడవ పడుతుండేవాడు.

శనివారం కూడా ఇంట్లో వీరిద్దరి మధ్య బంగారం విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివశంకర్ భార్యపై కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపాడు. అనంతరం మనస్తాపానికి గురైన శివశంకర్ తుర్కదిన్నె గ్రామ సమీపంలోని ఓ రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు ఒక బాబు, భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేష్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News