Saturday, March 1, 2025

నడిరోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా నడిరోడ్డుపై గొంతుకోసి దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఆర్.బి.నగర్‌కు చెందిన నర్సింహులు, మహేశ్వరి భార్యాభర్తలు. స్థానిక నిజాంసాగర్ చౌరస్తాలో సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో నర్సింహులు పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవలు నడుస్తుండేవి. ఇదే విషయమై గొడవపడిన నర్సింహులు శనివారం మధ్యాహ్నం నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. కోపం తట్టుకోలేక తన వెంట తెచ్చుకున్న చాకుతో ఆమె గొంతు కోసి అనంతరం అదే కత్తితో తాను కూడా కడుపు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

స్థానికులు అతనిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు. ఎఎస్‌పి చైతన్యరెడ్డి, సిఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. నర్సింహులు హత్యకు పాల్పడిన చాకు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని అతని భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషమయై సిఐ చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా కుటుంబ కలహాలతో హత్య చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News