Friday, December 27, 2024

మద్యం మత్తులో భార్యను చంపిన కసాయి అరెస్టు

- Advertisement -
- Advertisement -

జక్రాన్‌పల్లి : మద్యం మత్తులో భార్యను చంపిన కసాయిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మండలంలోని నూర్‌సింగ్ తండాలో చోటుచేసుకున్న ఘటనపై   డిచ్‌పల్లి సిఐ మల్లేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. నూర్‌సింగ్ తండాకు చెందిన  కేలోత్ సరితకు దాదాపు 20 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కేలోత్ శ్రీనివాస్ (సుధాకర్)తో వివాహమైంది. శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచుగా భార్యతో గొడవ పడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 1వ తేదీ రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు ఇంటికి వచ్చిన శ్రీనివాస్   ఏదో ఒక విషయమై గొడవ పెట్టుకొన్నాడు.

ఎలాగైనా ఆమెను చంపాలని అనుకుని పథకం ప్రకారం అదే రోజు సాయంత్రం బాగా మద్యం తాగి వచ్చి పిడిగుద్దులు గుద్ది,  గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా నిందితుడు  కేలోత్ శ్రీనివాస్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News