Monday, January 20, 2025

భార్య గొంతు నులిమి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్య గొంతు నులుమి భర్త హత్య చేసిన ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన దాసోజు బ్రహ్మచారి తన భార్య సరిత (31) పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. బ్రహ్మచారి డోర్ పాలిష్ వర్క్‌చేస్తూ , అతని భార్య సరిత ప్రైవేట్ స్కూల్ నందు టీచర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. గత కొద్ది రోజులుగా వారి కుటుంబ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని,

బ్రహ్మచారి కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడని, బుధవారం రోజున ఉదయం సుమారు 6 గంటల సమయంలో బ్రహ్మచారీ తన భార్య తో గొడవపడి ఇంటిలో ఉన్న జి వైర్ తన భార్య మెడకు చుట్టి బలంగా లాగి హత్య చేసాడని తెలిపారు. మృతురాలి తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు, కాగా బ్రహ్మచారీ సరితలు 2014లో కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News