Monday, January 20, 2025

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

- Advertisement -
- Advertisement -

 

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛినం చేస్తున్నాయి. కట్టుకున్న భర్తనే చంపిన ఓ ఇల్లాలు అతను కనిపించడంలేదంటూ నమ్మించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. ఈ ఘటనలో విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో వాసవానిపాలేనికి చెందిన జ్యోతికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. జ్యోతి తన ప్రియుడు నూకరాజుతో కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. భర్తకు అన్నంలో నిద్రమాత్రలిచ్చి అతను పడుకున్నాక ప్రియుడితో కలిసి తీగతో గొంతు బిగించి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి బూడిదను సముద్రంలో కలిపేసింది. తీరా భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News