హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ భార్య భర్తను కిరాతకంగా హత్య చేసింది. ప్రమాదవశాత్తు మరణించాడని కథ అల్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర బోయిన శ్రీనివాస్, భార్య సీతామహాలక్ష్మి జీవనం సాగిస్తున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో అటెండర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నాడు. అయితే భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని భావించిన భార్య డిసెంబర్ 30 ఉదయం తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ ను కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో సీతా మహాలక్ష్మి జాయిన్ చేసింది. డిసెంబర్ 29న అర్థరాత్రి శ్రీనివాస్ వంటింట్లో కాలు జారిపడ్డాడని, దీంతో తలకు తీవ్ర గాయమైంది అని చెప్పింది. దాంతో జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించాడు. భర్త రోజు తాగి వచ్చి వేధిస్తున్నాడని, అందుకే అతడిని హతమార్చినట్లు పోలీసు విచారణలో అంగీకరించిందని పోలీసులు తెలిపారు.