Friday, January 24, 2025

భార్య, ముగ్గురు పిల్లలను చంపేసి… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: భార్య, ముగ్గురు పిల్లలు, భార్యను చంపేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హన్‌పూర్ జిల్లా నేపానగర్ ప్రాంతంలో జరిగింది. దావల్ ఖర్డ్ గ్రామంలో మనోజ్ – సధ్నా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు అక్షర, నేహ, టాను అనే పిల్లలు ఉన్నారు. మనోజ్ కిరాణా జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వినియోగదారులు పాల కోసం వచ్చేసరికి మనోజ్ షాపు తీయకపోవడంతో ఇంటికి వెళ్లారు. ఇంట్లో లోపలి నుంచి గడియపెట్టి ఉంది. గ్రామస్థులు ఎంత పిలిచినా ఇంట్లో ఉన్నవాళ్లు స్పందించకపోవడంతో కిటీకి డోర్ పగలగొట్టారు. దంపతులు ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ తన ముగ్గురు పిల్లలు, భార్యను ఉరి పెట్టి చంపేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News