Sunday, December 22, 2024

ఆస్తికోసం తల్లిదండ్రులతో కలిసి భర్తను చంపిన భార్య…

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఆస్తికోసం తల్లిదండ్రులతో కలిసి భర్తను భార్య హతమార్చి సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో చోటు చేసుకుంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన సైదయ్య అనే వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సోని అనే మహిళను పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. సైదయ్యకు మూడు ఎకరాల భూమి ఉంది. అందులో గత ఏడాది ఒక ఎకరా భూమి అమ్మాడు. దీంతో ఆమె భూమి అమ్మిన డబ్బు, మిగతా భూమి తన పేరు మీద రాయాలని భర్తతో గొడవలు పెట్టుకునేది. ఈ క్రమంలోనే సోని తల్లిదండ్రులు శనివారం అయ్యవారి పల్లికి వచ్చారు. ఆస్తి విషయంలో భార్య భర్తలు ఇద్దరికి గొడవ జరిగింది. బాండ్ పేపర్‌లు తీసుకొచ్చి ఆస్తి తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేసింది. ఎన్ని సార్లు అడిగిన సైదయ్య ఒప్పుకోకపోవడంతో సోని ఆమె తల్లిదండ్రులతో కలిసి సైదయ్య గొంతు నులిమి చంపింది. సైదయ్యను చంపారని తెలుసుకున్న గ్రామస్తులు సైదయ్య భార్య, అత్తమామల్ని చితకబాదారు. సైదయ్య సోదరి సైదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోని, వారి తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News