Friday, December 20, 2024

మద్యం సేవించి భర్త మృతి…. భార్య, ప్రియుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తాగే మద్యం సీసాలో విషం కలిపి ఇవ్వడంతో అతడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అవుశాపూర్ గ్రామంలో మౌలాన్-శాంతి అనే దంపతులు నివసిస్తున్నారు. బాబు అనే వ్యక్తితో శాంతి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో మద్యం బాటిళ్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది. భర్త మద్యం సేవించి అనంతరం చనిపోయాడు. తన భర్త కడుపు నొప్పితో చనిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో విషం తాగి చనిపోయినట్టు రావడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. భార్యతో పాటు ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News