Monday, December 23, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ న్యూస్: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా సిసి కుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పావని-నవీన్ అనే దంపతులు సిసి కుంటలో నివసిస్తున్నారు. పావనికి హరి పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని చంపాలని ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ వేసింది. ప్రియుడు హరితో కలిసి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. చెరువులో మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకొని నవీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు స్థానిక నేత లక్ష్మణ్ సహాయం చేస్తున్నాడని నవీన్ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు డబ్బులు తీసుకొని ఈ కేసును నీరుగార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయం కోసం నవీన్ తల్లిదండ్రులు హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News