Tuesday, December 24, 2024

పిల్లలను చంపిన భర్తను కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: పిల్లలని చంపిన భర్త.. తనని కూడా చంపుతాడనే అనుమానంతో అతడిని భార్య హత్య చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓంకార్(39) అనే వ్యక్తి మహేశ్వరిని మూడో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండో పెళ్లి. ఈ దంపతులుకు ఇద్దరు చందన్(03), విశ్వనాథ్(01) అనే పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం ఉండడంతో పలుమార్లు ఆమెను వేధించాడు. ఆగష్టు 17న భార్య పిల్లలతో కలిసి ఎత్తం గుట్ట వద్దకు తీసుకెళ్లి పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఓంకార్ తన గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.

మహేశ్వరి అక్కడి నుంచి తప్పించుకుంది. ఓంకార్‌ను ఆస్పత్రికి తరలించడంతో బ్రతికి బయటపడ్డాడు. సెప్టెంబర్ 16న ఓ కుడికిల్లకు రావడంతో తనని కూడా భర్త చంపుతాడనే అనుమానం పెట్టుకుంది. ఇంట్లో వెళ్లి కత్తి తీసుకొని ఓంకార్‌ను పలుమార్లు పొడవడంతో అతడు ప్రాణాలు విడిచాడు. వెంటనే ఆమె కోల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News