Thursday, November 21, 2024

ప్రియునితో కలసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife Killed Husband in Panjagutta Hyderabad

పంజాగుట్ట: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య ప్రియునితో కలసి భర్తను హతమార్చిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన ఖైరతాబాద్‌లోని రాజ్‌నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బిహార్‌కు చెందిన లక్ష్మణ్ జాతో కలసి కుశ్భుదేవి రాజ్‌నగర్‌లో జ్యూస్ పాయింట్‌ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం మొదలు పెట్టారు. కాగా తనతో పాటు జ్యూస్ పాయింట్ నిర్వహణకు గాను లక్ష్మణ్‌లాల్ బాబు అనే వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకున్నాడు. దీంతో లాల్‌బాబుతో కుశ్భు దేవికి పరిచయం ఏర్పడింది. లాల్‌బాబు భార్య అనారోగ్య కారణాలతో మరణించింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న లాల్ బాబు కుశ్భు దేవితో మరింత సాన్నిహిత్యం పెరగడంతో వారిరువురి మధ్య చనువు కాస్తా శారీరక సంబంధం గా మారింది.

లాక్ డౌన్ రావడంతో లాల్ బాబు తన స్వంత గ్రామానికి వెళ్ళిపోయి, తదనంతరం లాక్‌డౌన్ తరువాత తిరిగి మరలా నగరానికి వచ్చాడు. కాని అతను మృతుడు లక్ష్మణ్ జా వద్ద పనిమానేసి వేరే హోటల్‌లో పని చేయసాగాడు. అయినప్పటికి వారిరువురి మధ్య ఉన్న సంబధం మాత్రం చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. దీంతో కుశ్భుదేవి తమ సంతోషానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో తన భర్త లక్ష్మణ్‌ని అడ్డు తొలగించుకుని లాల్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఈనెల 14న నింధితులు పథకంలో భాగంగా లక్ష్మణ్ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో కుశ్భుదేవి ఫోన్ ద్వారా లాల్‌బాబుకి సమాచారం అందించడంతో అతను లక్ష్మణ్ ఇంటికి గుట్టు చప్పుడు కాకుండా వచ్చాడు. ఇంటిలోకి ప్రవేశించిన లాల్ బాబు కుశ్భుదేవితో కలసి మృతుడు లక్ష్మణ్‌ను తన చూన్నితో గొంతుకు ఉరి వేసి చంపారు. లాల్ బాబు లక్ష్మణ్‌ను చెతులు కాళ్ళు కదలకుండా పట్టుకోగా, కుశ్భుదేవి మృతుడి చాతిపై కుర్చుని చున్నితో బలంగా లాగి చంపినట్లు తమ విచారణలో తెలిపినట్లు ఇన్‌స్పేక్టర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. లక్ష్మణ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తరువాత లాల్ బాబు ఏమి తెలియనట్లే అక్కడినుంచి జారుకోగా, కుశ్భుదేవి కూడా ఏమి తెలియనట్లుగా పడుకుంది.

తెల్లవారు జామున తన భర్త నిద్రలోనే చనిపోయినట్లుగా మృతుడి సోదరుడు బిహారి జాకి తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన బిహారిజా తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. విచారణలో కుశ్భుదేవి తాను ఒక్కతినే లక్ష్మణ్‌ను చంపినట్లుగా నేరం అంగికరించగా ఆమె కాల్ డేటాను పరిక్షించగా ఆమెతో లాల్‌కు ఉన్న నిరంతర సంభాషణ ద్వారా అతనిని కూడా విచారించగా ఆమెకు సహకరించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. నింధితులను ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ కేసు చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన డీఐ నాగ య్య, డీఎస్‌ఐ విజయ్ భాస్కర్ రెడ్డి లతో పాటు సబ్ ఇన్‌స్పక్టర్ జాహేద్‌లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News