- Advertisement -
సిద్దిపేట: దంపతుల మధ్య గొడవ జరగడంతో భర్తను భార్య గొడ్డలితో నరికి చంపిన సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కంటి ఎల్లయ్య (65), నర్సవ్వ (60) అనే వృద్ధ దంపతులు విఠలాపురం గ్రామంలో నివసిస్తున్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్యతో భర్త గొడవ పడుతుండడంతో క్షణాకవేశంలో భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. గ్రామస్థుల సమాచారం మేరకు సిద్ధిపేట సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ కలహాలతో భార్య భర్తను గొడ్డలితో నరికి చంపేశారు.
- Advertisement -