Tuesday, December 24, 2024

నల్లగా ఉన్నావని అన్నందుకు భర్తను నరికి చంపింది….

- Advertisement -
- Advertisement -

Wife killed husband over Color discrimination

రాయ్ పూర్: నల్లగా ఉన్నావని భార్యను పలుమార్లు భర్త హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఆమె భర్తను గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమలేశ్వర్ గ్రామంలో అనంత్ సానువాని, సంగీత అనే దంపతులు నివసిస్తున్నారు. భార్య నల్లగా ఉండడంతో భర్త పలుమార్లు నల్లగా ఉన్నావని ఆమెను వేధించాడు. ఆదివారం నల్లగా ఉన్నావని హేళన చేయడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గొడ్డలి తీసుకొని భర్తను భార్య నరికింది. అనంతరం మర్మాంగాలను కోసింది. తన భర్తను ఎవరో హత్య చేశారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతుండగా పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News