Wednesday, January 22, 2025

ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం కోసం భర్తను చంపాలనుకుంది… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం కోసం కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి భర్తకు ఇవ్వడంతో అతడి స్నేహితుడితో పాటు అతడు మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రఫీక్, మహమూద్ అనే దంపతులు సౌరాష్ట్రాలోని జునాగఢ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. రఫీక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం మహమూద్ అసిఫ్ చౌహాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో పాటు వీళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

దీంతో రఫీక్ చంపాలని ప్రియుడితో భార్య ప్లాన్ వేసింది. ఇమ్రాన్ అనే వ్యక్తి వీరికి సైనైడ్ ఇచ్చాడు. కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి భర్తకు భార్య ఇచ్చింది. భర్తతో పాటు అతడు స్నేహితుడు కూల్ డ్రింక్‌ను సేవించాడు. కూల్ డ్రింక్ తాగిని కొంచెం సేపటికి ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షలో వారు సైనైడ్ సేవించారని తేలడంతో దర్యాప్తు ప్రారంభించారు. భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం కోసం భర్తను చంపానని ఆమె తెలిపింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌పి రవి తేజా వశమ్ శెట్టి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News