Thursday, January 23, 2025

ప్రియుడితో కలిసి భర్తను చంపి… పని చేసే చోటే పూడ్చి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ప్రియుడితో సన్నిహితంగా ఉందని భార్యను భర్త నిలదీయడంతో అతడిని ఇద్దరు కలిసి హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నాటకకు చెందిన రమేష్ తో(27) ఎనిమిది సంవత్సరాల క్రితం వికారాబాద్ కు చెందిన వెన్నెల (25)కు పెళ్లి జరిగింది. హైదరాబాద్ లో దంపతులు భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని చేసే దగ్గర దస్తప్పతో వెన్నెలకు పరిచయం కావడంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రమేష్ కు తెలియడంతో ముగ్గురు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

కుటుంబంతో కలిసి రమేష్ ఎల్లారెడ్డి గూడెం వెళ్లాడు. ఈ నెల 30న పనుల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్తానని ఇంట్లో చెప్పి రమేష్ వెళ్లిపోయాడు. అదే రాత్రి 11 గంటల సమయంలో దస్తప్పను వెన్నెల ఇంటికి పిలుపించుకుంది. అదేసమయంలో రమేష్ ఇంటికి రావడంతో ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా రమేష్ మెడకు ప్రియుడు తాడు చుట్టు బిగించడంతో ఆమె అతడి కాళ్లను బిగ్గరగా పట్టుకుంది. అతడు చనిపోగానే అదే స్థలంలో గుంత తీసి పూడ్చారు. రమేష్ అన్న వెంకటప్ప తన తమ్ముడి గురించి వెన్నెల అడగగా ఎటో వెళ్లిపోయాడని సమాధానం ఇచ్చింది.  ఆమెను గట్టిగా నిలదీయడంతో ప్రియుడితో కలిసి తానే హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు ఆమె పట్టుకొని ఎల్లారెడ్డికి తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పోలీస్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News