Monday, December 23, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపి… భర్త కనిపించడం లేదని ఫిర్యాదు…

- Advertisement -
- Advertisement -

Wife killed husband with lover

అమరావతి: ప్రియుడితో కలిసి భర్తను చంపి అనంతరం అతడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిల్లలవలస గ్రామానికి చెందిన బుడుమూరి మురళి(43) అనే యువకుడు మృదులను(29) 2014లో పెళ్లి చేసుకున్నాడు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశంలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. మురళి, మృదుల అనే దంపతులకు కుమారుడు ఉన్నాడు. కుమారుడు అనారోగ్యం పాలుకావడంతో 2019లో సొంతూరుకు పంపించాడు. మధురవాడలోని సాయిరాంకాలనీలో ఉంటున్న హరిశంకర్ వర్మ(18) అనే యువకుడితో మృదులకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

జూలై 9న ఎరిత్రియా దేశం నుంచి మురళీ ఇంటికి వచ్చాడు. నెల రోజుల సెలవు పెట్టి వచ్చానని భార్యకు చెప్పాడు. మృదుల ప్రియుడికి ఫోన్ చేసి తన భర్తతో ఉండలేనని, నాకు సంసారం చేయడం ఇష్టం లేదని తెలిపింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో మురళి రెండు చేతులను హరిశంకర్ పట్టుకోగా భార్య పెనంతో గట్టగా తలపై కొట్టింది. హ్యాండిల్ విరిగిపోవడంతో కుక్కర్ మూత తెచ్చి మళ్లీ గట్టిగా కొట్టడంతో మురళి దుర్మరణం చెందాడు. వెంటనే మృతదేహాన్ని దుస్తువుల మూటలో కట్టి మారికవలస వంతెన వద్ద పడేశారు. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు చేసింది. మృదుల కదలికలపై అనుమానం ఉండడంతో ఆమె కాల్ హిస్టరీని చెక్ చేయగానే హరిశంకర్‌కు పలుమార్లు ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తన ప్రియుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News