Sunday, January 19, 2025

ప్రేమపెళ్లి… ప్రియుడితో కలిసి భర్తను చంపి…

- Advertisement -
- Advertisement -

 

నెల్లూరు: ప్రేమించింది… కులాంతర వివాహం చేసుకుంది.. కానీ ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గందల్ల చినమణి-శోభ ప్రేమించుకున్నారు… కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులు నెల్లూరు జిల్లా గ్రామీణ మండలం నారాయణ రెడ్డి పేటకు చెంది భరత్ కుమార్ రెడ్డి వద్ద ఇద్దరు పని చేసేవారు. భరత్ కుమార్ రెడ్డితో శోభ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడి నుంచి రొయ్యల చెరువుల వద్ద కాపలా పనుల్లో ఇద్దరు చేరారు.

భరత్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడంతో భార్యభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయం భరత్ రెడ్డికి చెప్పడంతో అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను చంపాలని ప్లాన్ వేశారు. భరత్, మస్తాన్, సమీవుల్లా, నవీన్ ముగ్గురు కలిసి అక్కడికి చేరుకొని చినమణిని గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి నక్కల కాలువలో పడేశారు. శోభ తన భర్త కనిపించడంలేదని బంధువుల, స్థానికులకు తెలిపింది. చినమణి కుమారుడు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. నిందితులపై ఎస్‌సి, ఎస్టి ఎట్రాసిటీ కేసుతో పాటు వారిపై రౌడీ షీటు ఓపెన్ చేశామని నెల్లూరు గ్రామీణ డిఎస్‌పి హరినాథ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News