Sunday, December 22, 2024

కొడుకుతో కలిసి భర్తను భార్య 22 ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భార్య తన కుమారుడితో కలిసి భర్తను చంపి అనంతరం శరీర భాగాలను 22 ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాలలో పడేసిన సంఘటన ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. త్రిలోక్‌పూర్ ప్రాంతంలో పూనమ్-అంజన్ దాస్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు దీపక్ అనే కుమారుడు ఉన్నాడు. అంజన్‌దాస్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అతడు గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత అతడిని చంపేసి 22 ముక్కలుగా నరికారు. అనంతరం శరీరభాగాలను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచారు. శరీరభాగాలను బ్యాగులోకి తీసుకొని వివిధ ప్రదేశాలలో పడేశారు. రామ్‌లీల్ మైదానంలో కల్యాణ్‌పురీ ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో శరీర భాగాలను పడేశారు.

పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు చెట్ల పొదల్లో నుంచి వాసన రావడంతో బ్యాగ్‌ను బయటకు తీయగా మనిషి శరీర భాగాలుగా గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్న సిసి టివి ఫుటేజీ పరిశీలించగా ఓ మహిళ, మరో యువకుడిగా గుర్తించారు. వెంటనే పోలీసులు సిసి ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అంజన్‌దాస్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ హత్య చేసినట్టు సమాచారం. గత నెలలో అఫ్తాబ్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్ధావాకర్‌ను 36 ముక్కలు ముక్కలు నరికి వివిధ ప్రదేశాలలోపడేసిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News