Monday, January 20, 2025

20 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య

- Advertisement -
- Advertisement -

wife kills husband in hyderabad

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. రూ.20 లక్షలు సుపారీ ఇచ్చి ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఆమె సుపారీ ఇచ్చింది. భర్తను చంపేసిన తర్వాత మృతదేహాన్ని ఇద్దరు కలిసి కృష్ణనదిలో పడేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామం లావూడి తండాకు చెందిన దారవత్‌ రాగ్యాకు పెద్దవూర మండలానికి చెందిన రోజాకు 2010లో వివాహం జరిగింది. వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ కుటుంబం మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌ రాయుదుర్గంలోని ఓ అద్దె ఇంట్లో నివాసిస్తున్నారు. భర్తతో ఆమె 12 ఏళ్ల కాపురం చేసింది.  వివాహేతర సంబంధం మోజులోపడ్డ ఆమె రాసలీలలకు భర్త అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News