Thursday, December 19, 2024

అన్నంలో చీమలు పడ్డాయని అడిగినందుకు భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: అన్నంలో చీమలు ఎలా పడ్డాయని భార్యను అడిగినందుకు అతడిని భర్త చంపేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హేమంతా బాఘ్(35), సరిత(30) అనే దంపతులు కూతురు హేమలత(07), సౌమ్య(04) కలిసి జీవిస్తున్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి గత రాత్రి భోజనం చేస్తుండగా అన్నంలో చీమలు కనిపించడంతో భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరు గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో భర్త గొంతు నులిమి భార్య చంపేసింది. హేమంత్ తండ్రి శశిభూషణ్ భాఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News