Monday, December 23, 2024

ప్రేమపెళ్లి…. భర్త మృతదేహంతో మూడు రోజులు గడిపి….

- Advertisement -
- Advertisement -

Wife live with Husband dead body

 

బెంగళూరు: ప్రేమించింది… పెళ్లి చేసుకున్న తొమ్మిది సంవత్సరాల తరువాత భర్త చనిపోవడంతో అతడి మృతదేహంతో భార్య మూడు రోజులు గడిపిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుబ్లీ నవనగర్ ఎల్‌ఐజి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధార్వాడ ప్రాంతంలోని ఎత్తిగిన గూడులో మంజునాథ(30) తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా మంజునాథ మృతిదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మూడు రోజుల క్రితమే తన భర్త చనిపోయాడని ఆమె పోలీసులకు తెలిపింది. మంజునాథ మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News