Tuesday, December 24, 2024

భర్తను చంపేస్తే… పెళ్లి చేసుకుంటానని ఆఫర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: భర్తను చంపితే ప్రియుడ్ని పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు చెప్పడంతో భర్తను ఆమె ప్రియుడి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్వాల గ్రామంలో దాడి బండ ఆమోస్(26) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అరుణను ప్రేమించాడు. అరుణ కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దంపతులు కర్నూలులో నివాసం ఉంటున్నారు. బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. బట్టల షోరూమ్‌లో ఆమె సేల్స్ గర్ల్‌గా పని చేస్తుంది. వీరిద్దరూ సూర్య ప్రదీప్ ఆటోలో వెళ్లి వస్తుండగా సూర్యతో అరుణకు పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆమోస్ తన భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో తన బాధను ప్రియుడికి చెప్పుకుంది. భర్తను చంపేస్తే పెళ్లి చేసుకుంటానని ప్రియుడుకు చెప్పింది. హత్య చేయడానికి మరో స్నేహితుడు జీవన్ కుమార్‌తో ప్రియుడు కలిసి ప్లాన్ వేశాడు. మద్యం తాగుతామని ఆమోస్‌తో కలిసి జీవన్, సూర్య ప్రదీప్ బయటకు వెళ్లారు. ఆమోస్ పూటుగా తాగిన తరువాత అతడి తలపై రాడ్‌తో కొట్టారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం మృతదేహాన్ని హంద్రీ ఒడ్డుకు ఈడ్చుకెళ్లి పడేశారు. చంపేశామని అరుణకు ప్రియుడు ఫోన్ చేసి చెప్పాడు. డిసెంబర్ 24న గుర్తు తెలియని శవం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అరుణను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తన ప్రియుడితో హత్య చేయించానని ఒప్పుకుంది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News