Monday, December 23, 2024

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: భార్యకు ప్రియుడికి భర్త పెళ్లి చేసిన సంఘటన ఒడిశాలోని సోన్‌పూర్ జిల్లా శుభలాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మూడు సంవత్సరాల క్రితం మాధవ్ ప్రధాన్ అనే యువకుడు, జిల్లి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జిల్లి తన దూరపు బంధువు పరమేశ్వర్ ప్రధాన్‌తో ప్రేమలో పడింది. దీంతో వారి మధ్య సనిహత్యం పెరగడంతో ఇద్దరు కలిసి పారిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త మాధవ్ ప్రధాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి జాడను గుర్తించి పిఎస్‌కు తీసుకొచ్చారు. జిల్లి మాత్రం తన ప్రియుడు పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని ఖరాఖండిగా చెప్పేసింది. వారి పెళ్లికి భర్త ఒప్పుకోవడంతో అతడి భార్య, ప్రియుడికి పోలీసులు వివాహం జరిపించారు. ప్రియుడితో భార్య పెళ్లి చేసి గొప్ప మనసున్న భర్తగా మిగిలిపోయారని మహిళా నెటిజన్లు పొగుడుతున్నారు.

Also Read: జిమ్ చేస్తుండగా మెడ విరిగి బాడీ బిల్డర్ మృతి.. (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News