Monday, December 23, 2024

భర్త చెల్లిల్ని పెళ్లి చేసుకున్న భార్య…

- Advertisement -
- Advertisement -

పాట్నా: భర్త సోదరిని భార్య పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సమస్తిపూర్ జిల్లా రోసెరా బ్లాక్‌లో శుక్లా దేవి(32), ప్రమోద్ దాస్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమోద్ దాస్‌కు సోనూ దేవి(18) సోదరి ఉంది. ఆరు నెలల క్రితం శుక్లా దేవి, సోనూ దేవిని పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. శుక్లా దేవి అటు భర్తతో కూడా కాపురం చేస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంతోనే పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని సోనూ దేవి తెలిపింది. తన ప్రేమ వివాహంలో ఎటువంటి దాపురికం లేదని సోనూ తెలిపింది. ప్రమోద్ దాస్ మీడియాతో మాట్లాడారు. వాళ్లు ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు తనకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు. తనతో కూడా తన భార్యం కాపురం చేస్తుందని చెప్పాడు. శుక్లా దేవి జట్టు కట్ చేయించుకోవడంతో ప్యాట్, షర్ట్ ధరించి మగరాయుడిలా స్టిల్ ఇచ్చింది. సోనూ దేవిని ఆమె బంధువులు తీసుకొని పోవడంతో శుక్లా దేవి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎలా కేసు నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News