Sunday, December 22, 2024

కారుతో నలుగురిని ఢీకొట్టిన ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్ బయట పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య తన కారుతో నలుగురిని ఢీకొట్టింది. వీరంతా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఎయిమ్స్ ఆస్పత్రి 6 ఎ, 6 బి నెంబరు గేటు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఎయిమ్స్ భద్రతా బలగాలు తెలిపాయని అధికారులు వివరించారు. సంఘటన ప్రదేశానికి వెళ్లి చూడగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కనిపించిందని, ఢిల్లీ పోలీస్‌లో నియామక మైన ఇన్‌స్పెక్టర్ భార్య విపిన్ సింగ్ అని బయటపడిందని అధికారులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన త్రిలోక్‌పురి నివాసులు గౌరవ్, అతని భార్య రీతిక, లాల్‌కుయాన్ నివాసి నిషాంత్, నొయిడా నివాసి రణవీర్ చికిత్సపొందినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాధితులు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే వారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదు. కానీ కేసు మాత్రం నిర్లక్షంగా కారు డ్రైవ్ చేయడం, వ్యక్తిగత భద్రతకు ప్రమాదం వాటిల్లేలా గాయపర్చడం వంటి కారణాలపై ఐపిసి 279, 337 కింద పోలీస్‌లు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News