Thursday, January 23, 2025

ప్రియుడితో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపిన భార్య

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : పవిత్రమైన వివాహ బంధాలు కేవలం శారీరక సంబంధాలుగా మారిపోతున్నాయనడానికి ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్ ఫేక్ మౌలానా హత్య ఉదంతమే నిదర్శనం అని చెప్పవచ్చును. ఈ నెల 5 ఆదివారం నాడు తన భర్త షేక్ మౌలానా (40 ) గుర్తు తెలియని విషం తీసుకున్నాడని, వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 7 మంగళవారం నాడు మరణించాడని ఆయన భార్య షాహనా బీన్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అనుమాన స్పద మృతిగా కేసును విచారించిన పోలీసులు రెండు రోజులలోనే భర్త చావుకు భార్య షాహనా భీన్ ఆమె ప్రియుడు యెరుకల బాబు( బెజిలి బాబు)లే కారణమని తేల్చారు.

ఈ మేరకు పోలీసులు గురువారం కేసు వివరాలను వెల్లడించారు. గత 7 సంవత్సరాలుగా మౌలానా దుబాయిలో ఉంటుండే వాడని, ప్రతి సంవత్సరం అవుపాపూర్‌కు వచ్చి నెల, రెండు నెలలు ఉండేవాడని, ఈ క్రమంలో గత 10 నెలల క్రితం దుబాయి నుండి వచ్చిన మౌలానా ఆదివారం తన కుమారుడితో వేటకు వెళ్లి అలసి పోయి ఇంటికి వచ్చి ఫ్రిజ్ కవర్‌లో ఉన్న ఓసి 180 ఎంఎల్ క్వార్టర్ బాటిల్ కనిపించడంతో తీసుకొని తాగగా వాంతులు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని, అంత్యక్రియ సమయంలో బంధుల అభ్యంతరాల మేరకు బార్యను విచారించగా భర్త హత్యకు బార్య ఆమె ప్రియుడు సూత్రదారులని గుర్తించిన పోలీసులు తమదైన తీరులో విచారణ చేపట్టారు.
18 ఏళ్ళ క్రితం ఇద్దరు ఒకే చోట పనిచేయడంతో ఏర్పడిన అక్రమ సంబంధం
18 ఏళ్ళ క్రితం షాహనాబిన్ బందువుల వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా యెరుకల బాబు పని చేస్తుండగా అక్కడే షాహనాబిన్ కూలీ పనులు చేసేది. షాహనా భీన్ అందంగా ఉండడంతో ఆమె పై కన్నెసి బాబు ఆమెకు సన్నిహితంగా ఉంటూ తన కోరికను పెంచుకునే వాడు, అలా నాటి నుండి వారి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తు వస్తుంది. పది నెలల క్రితం భర్త దుబాయి నుండి తిరగి రావడంతో వీరి ఆటలు సాగకపోవడం,

నిత్యం ప్రియుడితో భార్య ఫోన్లో మాట్లాడుతుండంతో అనుమానించిన భర్త మౌలానా ఆమె వద్దనుండి సెల్ ఫోన్ తీసుకోవడంతో ఇద్దరి మద్య గొడవల జరిగినట్లు దీనితో అవుషాపూర్‌లోని ఇంటిని విక్రయించి వేరే ప్రాంతానికి వెళ్ళాని యోచిస్తుండగా తము ఎక్కడ దూరమైతామేమోనని షాహనాభీన్ తన ప్రియుడు బాబుతో కలసి భర్తను అంతమోందించడానికి నిశ్చయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మౌలానా హత్య ఉదంతం
మౌలానాకు మధ్యం సేవించడం అలవాటు ఉండడంతో మధ్యంలో విషం కలిపి వదిలించుకోవాలని భార్య షాహనా భీన్ తన ప్రియుడు బాబుతో కలసి ప్లాన్ చేసింది. ఈ మేరకు బాబు అవుషాపూర్ శివారులోని తనకు తెలిసిన ఫామ్ హౌస్ నుండి పురుగుల మందు విషం తీసుకొని, సమీపంలోని వైన్స్ షాపు నుండి 180 ఎంఎల్ ఓసి విస్కీ, 90 ఎంఎల్ ఖాలీ మధ్యం సీసా కొనుగోలు చేశాడు. అనంతరం మెడికల్ షాపులో సిరంజి తీసుకొని తన ఇంటికి వెళ్ళి విస్కీ క్యాప్ ద్వారా విషం కలిపి ఆధివారం ప్రియురాలు షాహనా భీన్‌కు అందించాడు.

షాహనాభీన్ విషం కలిపిన మధ్యం బాటిల్‌ను ఫ్రిజ్ కింద దాచిపెట్టింది. మౌలానా తన చిన్న కుమారుడితో షికారుకు వెళ్ళి అలసి పోయి రావడం గమనించిన భార్య ఫ్రిజ్ కింద దాచిన విస్కీని ఫ్రీజ్ కవర్‌లో పెట్టింది. మద్యానికి బానిసైన మౌలానా దానిని చూసి తాగడంతో కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు ఏ1గా ప్రియుడు యెరుకల బాబు, ఏ2 షాహనా భీన్‌గా కేసులు నామోదు చేసి రిమాండ్ తరలించారు. ఈ మేరకు రెండు రోజులలో సహజ మరణం కాదు అది హత్య అని చేల్చి సూత్ర దారులైన వారిని కటకటాలలోకి నెట్టడంతో పట్ల ఘట్‌కేసర్ పోలీసులను మల్కాజిగిరి జోన్ డిఎస్‌పి జానకి ధరావత్, మల్కాజిగిరి ఏసిపి పి. నరేష్ రెడ్డిలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News