Tuesday, January 21, 2025

భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించి..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆస్తి తన పేరు మీద రాయలేదని భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాలీమార్ భాగ్ లో ఓ వృద్ధ దంపతులు తన కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. భార్యభర్తల మధ్య కొంత కాలంగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వృద్ధుడు ఒక ఇల్లు అమ్మి మరో ఇల్లును కొనుగోలు చేశాడు. కొత్తగా కొన్న ఇల్లును తన పేరు మీద రిజిస్టర్ చేయాలని భార్య పలుమార్లు అడిగింది. భార్య పేరు మీద అవసరం లేదని తన పేరు మీద వృద్ధుడు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆగ్రహంతో భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. పై అంతస్థులో ఉన్న కుమారుడు, కోడలు వచ్చి మంటలను ఆర్పి అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు వృద్ధుడి నుంచి వాంగ్మూలం తీసుకొని భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News