Monday, December 23, 2024

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త ఇంటి ముందు మంగళవారం ఓ ఇళ్లాలు ధర్నాకు దిగింది. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చెన్నం యశ్వంత్ రెడ్డి పొందుర్తి గ్రామానికి చెందిన దళిత యువతి మల్లారెడ్డిపేట రజిత తో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రేమవ్యవహారం నడిపించాడు. గత ఏడు నెలల క్రితం ఆర్యసమాజంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్థుతం రజిత రెండు నెలల గర్భవతిగా ఉందని తెలిసాక తన తల్లి తండ్రులు వద్దంటుంన్నారని ఒదిలేశాడు.

దీంతో ఏమి చేయాలో తోచని రజిత తనను స్వీకరించాలని కోరుతు యశ్వంత్ ఇంటి ముందు ధర్నా కు దిగింది. ఇంటిముందు ధర్నా చేస్తే అతని అల్లుడు రోహిన్ బైక్‌పై పెట్రోల్ పోసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రజిత తెలిపింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మార్పీస్ జిల్లా అద్యక్షుడు బాగయ్య, రాష్ట్ర కార్యదర్శి శంకర్ బాదితురాలికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పొందుర్తి గ్రామానికి చెందిన దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి తీరా ఒదిలేసిన యశ్వంత్‌రెడ్డి ఆమె స్వీకరించాలని డిమాండ్ చేశారు. వికలాంగురాలైన దళిత యువతికి న్యాయం జరిగే వరకు ఎం ఆర్ పి ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News