- Advertisement -
ఎల్బీనగర్ : భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన సంఘటన నాగోల్ ఠా ణా పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్‌కు చెందిన తరిగోపుల అమరేందర్ హైకోర్టు న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. అమరేందర్ పల్లవిని పెళ్లి చేసుకోగా వారిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దీంతో అమరేందర్ మరో పెళ్లి చేసుకొని ఇంటికి రాకుండా పట్టించుకోవటం లేదు. దీంతో జైపురి కాలనీలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టారు. అనంతరం సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో పల్లవి ఫిర్యాదు చేయడంతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -