Thursday, January 9, 2025

భర్తను చంపి..పక్కనే నిద్రించి

- Advertisement -
- Advertisement -

రాయబరేలి: తనతో గొడవపడిన భర్తను హతమార్చిన ఒక మహిళ అతని శవం పక్కనే రాత్రంతా నిద్రించిన షాకింగ్ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలిలో చోటుచేసుకుంది. తండ్రి నిద్రపోతున్నాడని, లేపవద్దని పిల్లలకు చెప్పి బయటకు వెళ్లిపోయింది ఆ మహిళ. బఛ్రవన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సహాగో పశ్చిమ్ గ్రామంలో నివసించే అటుల్ సగో పెళ్లిళ్లు, ఇతర ఉత్సవాలకు క్యాటగిరింగ్ పనిచేసేవాడు. రోజూ మద్యం పుచ్చుకునే సగో భార్య అనూతో గొడవపడేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. అన్ను బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గత వారం ఒక రోజు రాత్రి తాగి వచ్చిన అటుల్ భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో తిరగబడ్డ అన్ను భర్త తలపై రాతితో మోదింది.

స్పృహతప్పి పడిపోయిన అటుల్‌ను గొంతు పిసికి చంపివేసింది. రాత్రంతా భర్త పక్కనే నిద్రపోయింది. మరుసటి రోజు తండ్రి నిద్రపోతున్నాడని, అతడిని నిద్రలేపవద్దని పిల్లలకు చెప్పి తాను తయారై బ్యూటీపార్లర్‌కు అన్ను వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన అన్ను వంటచేసి పిల్లలకు భోజనం పెట్టి వాళ్లను తొందరగా నిద్రపుచ్చింది. తాను మాత్రం అర్ధరాత్రి వరకు మేల్కోంది. అర్ధరాత్రి భర్త శవాన్ని ఒంటరిగా ఈడ్చుకుంటూ బయట గేటు వరకు తెచ్చి అక్కడ పడేసి ఇంట్లోకి వెళ్లిపోయి నిద్రపోయింది. ఉదయం..ముందుగా ఆమే గట్టిగా రోదిస్తూ రాత్రి మద్యం మత్తులో తన భర్త కిందపడిపోయి మరణించాడని అందరికీ చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు అటుల్ శవాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు. గొంతు నులమడం వల్లే అటుల్ మరణించినట్లు పోస్ట్‌మార్టమ్‌లో బయటపడడంతో పోలీసులు అన్నును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయాన్ని ఆమె చెప్పేసింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News