Wednesday, January 1, 2025

భర్త, ప్రియుడితో కలిసుంటానని కరెంట్ పోల్ ఎక్కిన మహిళ

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అంగీకరించడంలేదని సదరు మహిళ కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పిప్రాయిచ్ గ్రామంలో ఓ 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సదరు మహిళ వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో ప్రియుడు కూడా తమతో ఉండాలని ఆమె పట్టుబట్టింది. ఆమె ప్రియుడు తన కుటుంబంతో కలిసి ఉండటాన్ని ఆమె భర్త అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని భార్య కరెంట్ పోల్ ఎక్కింది. వెంటనే గ్రామస్థులు కరెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెకు సముదాయించి కిందకు దించారు. దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News